
విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్. జర్నీ సమయాల్లో కూడా విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఎయిర్ లైన్స్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. దీనికి సంబంధించి ఇంటర్నెట్ సేవలను ప్రయాణీకులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతి ఇస్తూ పౌర విమానయాన శాఖ ఇవాళ ( సోమవారం) నోటిఫికేషన్ ఇచ్చింది. విమాన ప్రయాణం సమయంలో ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేలా ప్రయాణీకులకు పైలట్ ఇన్ కమాండ్ అనుమతిని ఇవ్వవచ్చని… దీంతో వైఫై సదుపాయంతో ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, ఈ రీడర్ వంటి డివైజ్‌లను ఫ్లైట్ మోడ్, ఎరోప్లేన్ మోడ్‌లో ఉంచి ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. అయితే విమానంలో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ సేవలను అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్ జనరల్ కన్ఫాం చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం అనుమతితో విస్తారా ఎయిర్ లైన్స్ తొలి బోయింగ్ 787-9 విమానాన్ని వాషింగ్టన్‌లో అందుకుంది. భారత్‌లో వైఫై సేవలను అందించనున్న మొట్ట మొదటి విమానం ఇదే కానుందని విస్తారా సీఈవో చెప్పారు.