
కర్ణాటక ముఖ్యమంత్రి ఆఫీస్(CMO) ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒ పోస్ట్‌ను మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ తప్పుగా మార్చింది. ఈ తప్పు వల్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చనిపోయినట్లు చూపించింది.
అసలు విషయం ఏంటంటే ప్రముఖ నటి బి.సరోజా దేవి మరణం పట్ల సంతాపం తెలుపుతూ కన్నడలో పోస్ట్ చేసారు. కానీ మెటా టూల్ దీన్ని తప్పుగా ఇంగ్లీష్‌లోకి మార్చడంతో సిద్ధరామయ్య దీనిపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే మెటాకు ఒక అఫీషియల్ లెటర్ కూడా పంపారు.
మెటా ఫేస్ బుక్ పోస్ట్ తప్పుడు అనువాదంలో "ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిన్న కన్నుమూశారు, సీనియర్ నటి బి.సరోజాదేవి పార్థివ దేహానికి చివరి నివాళులర్పించారు" అంటూ మార్చింది.
కన్నడ ఆటో-ట్రాన్స్లేషన్ ఆపేయండి: ఈ తప్పుడు ట్రాన్స్లేషన్ పై తీవ్రంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు అలాగే మెటా సంస్థ కన్నడ ఆటో-ట్రాన్స్లేషన్ ఫీచర్ సరిగ్గా అనువాదించేవరకు వరకు ఆపేయాలని కోరారు.
మెటా యాప్స్ కన్నడ కంటెంట్‌ను తప్పుగా ఆటో-ట్రాన్స్లేషన్ చేయడం వల్ల వాస్తవాలను తప్పుగా మార్చేస్తు నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నాయి. అధికారిక సమాచారం ట్రాన్స్లేషన్ విషయానికి వస్తే ఇది చాలా ప్రమాదకరం. నా మీడియా సలహాదారుడు కెవి ప్రభాకర్ వెంటనే దీనిని సరిదిద్దలని కోరుతూ మెటాకు లెటర్ రాశారు అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు.
సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చూపించే అనువాదాలు ఎక్కువగా తప్పుగా ఉంటాయని ప్రజలు తెలుసుకోవాలి. టెక్ దిగ్గజాల ఇలాంటి నిర్లక్ష్యం ప్రజల అవగాహన, నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అని అన్నారు. అయితే చివరికి మెటా అనువాదాన్ని సరిదిద్దినట్లు తెలుస్తుంది.
కన్నడ నుండి ఇంగ్లీషు పదాల అనువాదాల నాణ్యత పెంచడానికి కన్నడ భాషా నిపుణులతో కలిసి పనిచేయాలని మెటాని కోరుతూ మీడియా సలహాదారుడు మెటాకు రాసిన లేఖను కూడా ముఖ్యమంత్రి పంపించారు. కన్నడ నుండి ఇంగ్లీషులోకి ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ ఎక్కువగా తప్పుగా ఉంటుందని, కొన్నిసార్లు సమాచారాన్ని తప్పుదారి పట్టిస్తున్నట్లు కూడా గమనించాము" అని పేర్కొంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి నుండి ప్రజా సమాచార ప్రసారాలు, అధికారిక ప్రకటనలు లేదా ముఖ్యమైన మెసేజులు తప్పుగా అనువదించినప్పుడు చాల ప్రమాదాన్ని కలిగిస్తుంది.