హైదరాబాద్, వెలుగు: తాము తీసుకుంటున్న యాంటీ-ఫ్రాడ్ చర్యలతో సైబర్ నేరాలపై ఫిర్యాదులు భారీగా తగ్గాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రిపోర్ట్ ప్రకారం, ఫైనాన్షియల్ లాస్‌లో 68.7శాతం తగ్గుదల, మొత్తం సైబర్ నేరాల్లో 14.3శాతం తగ్గుదల ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో రికార్డయ్యింది.
కిందటేడాది సెప్టెంబర్‌లో ఎయిర్‌టెల్ తన స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్లను లాంచ్ చేసింది. జూన్ నెలలోని డేటాను, ఈ ఏడాది జూన్‌తో పోల్చి తాజా లెక్కలు వేసింది. కంపెనీ ఏఐ ఆధారిత నెట్‌వర్క్ సొల్యూషన్లతో కిందటేడాది 4,830 కోట్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి, 3.2 లక్షల మోసపూరిత లింకులను బ్లాక్ చేసింది.
