ఎయిర్టెల్ సేవలకు అంతరాయం

ఎయిర్టెల్ సేవలకు అంతరాయం

టెలికాం దిగ్గజం ఎయిర్టెల్  సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11గంటల సమయంలో ఒక్కసారిగా మొబైల్ నెట్ వర్క్, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్ సేవలు నిలిచిపోయాయి. ఎయిర్ టెల్ యాప్ కూడా పని చేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఆందోళన,అసహనానికి గురయ్యారు. నెట్ వర్క్ పనిచేయడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఎయిర్టెల్కు కంప్లైంట్ చేశారు. ట్విట్టర్ లో ఎయిర్ టెల్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కంపెనీ స్పందించింది. కస్టమర్లకు క్షమాపణలు చెప్పింది. అంతరాయం కారణంగా కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ప్రకటించింది. అవాంతరాలు లేని అనుభవాన్ని అందించేందుకు మా బృందం పనిచేస్తుందని ట్విట్టర్లో ట్వీట్ చేసింది.