ఆస్ట్రేలియా సిరీస్‌‌కు అండర్- 18 హాకీ జట్ల ప్రకటన

ఆస్ట్రేలియా సిరీస్‌‌కు అండర్- 18 హాకీ జట్ల ప్రకటన

భోపాల్: ఈ నెల 15 నుంచి 20 వరకు ఆస్ట్రేలియాతో జరిగే స్వదేశీ సిరీస్ కోసం 24 మంది సభ్యులతో కూడిన భారత అండర్-18 పురుషుల, మహిళల జట్లను హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. భోపాల్‌‌లోని సాయ్ కేంద్రంలో ఈ నాలుగు మ్యాచ్‌‌ల సిరీస్ జరగనుంది. జపాన్‌‌లో నిర్వహించే ఆసియా కప్‌‌కు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది. జాతీయ కోచింగ్ క్యాంప్‌‌లో వారం రోజుల పాటు 42 మంది క్రీడాకారుల ఫిట్‌‌నెస్, వ్యూహాలను నిశితంగా పరిశీలించిన తర్వాత తుది 24 మందిని ఎంపిక చేశారు. పురుషుల జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్ కేతన్ కుష్వాహా, మహిళల జట్టుకు స్వీటీ కుజుర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

అండర్-18 పురుషుల జట్టు:

గోల్‌‌కీపర్లు: సావన్ కుమార్, ఆయుశ్ రజక్, విశాల్ బాడా. 
డిఫెండర్లు: అన్ష్ బాహుత్రా, ఆశిష్ తాని పూర్తీ, అర్మాన్ సోరెంగ్, దీపక్‌‌ప్రకాశ్ టొప్పో, కరణ్ గౌతమ్, కరణ్ ధనుక్. 
మిడ్‌‌ ఫీల్డర్లు: ప్రేమ్‌‌చంద్ సోయ్, రాహుల్ యాదవ్, వరీందర్ సింగ్, రోమిత్ పాల్, అర్జున్‌‌దీప్ సింగ్, గుర్సిమ్రాన్‌‌ప్రీత్ సింగ్, అర్ష్‌‌దీప్ సింగ్, అవి మణిపురి. 
ఫార్వర్డ్లు: ఆకాశ్ దీప్, కేతన్ కుష్వాహా (కెప్టెన్), షారూఖ్ అలీ, గాజీ ఖాన్, ప్రహ్లాద్ రాజ్‌‌భర్, సిద్ధార్థ్ బెన్, జైసన్ కందుల్నా.

అండర్-18 మహిళల జట్టు:

గోల్‌‌కీపర్లు: మహక్ పరిహార్, హ్యారీ, ఖిలీ కుమారి. 
డిఫెండర్లు: సుగన్ సంగ, నీలం టొప్పో, రుబినా బాక్లా, కిరణ్ ఎక్కా, దివ్య యాదవ్, సులోచని. 
మిడ్‌‌ ఫీల్డర్లు: శ్రుతి కుమారి, దియా, హర్షిత, రష్మీన్ కౌర్, లామింగంబి అకోయిజమ్, నాన్సీ సరోహా, టోంగ్‌‌బ్రామ్ లాంచెన్బి దేవి, స్నేహ దావదే. 
ఫార్వర్డ్లు: నౌషీన్ నాజ్, స్వీటీ కుజుర్ (కెప్టెన్), ప్రియాంక మింజ్, సందీప కుమారి, నమ్మి గీతశ్రీ, ప్రిన్సెస్ ప్రియా ఎక్కా, పుష్ప మాంఝీ.