Airtel Recharge Plans:ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్..3GB డేటా, OTT సబ్ స్క్రిప్షన్

Airtel Recharge Plans:ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్..3GB డేటా, OTT సబ్ స్క్రిప్షన్

టెలికాం సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ప్రస్తుత్త పోటీ మార్కెట్లో కస్టమర్లను పెంచుకోవడంతోపాటు వారి అవసరాలకు అనుగుణంగా డేటాతో పాటు OTT బెనిఫిట్స్ ను కొత్త రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. దేశంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్లతో ఒకటైన ఎయిర్ టెల్ కూడా తాజాగా కొత్త రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా డేటాతో పాటు OTT సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తోంది. 

ఎయిర్ టెల్ కొత్తగా రూ.699 తో రీచార్జ్ ప్లాన్ 

ఎయిర్ టెల్ కొత్తగా రూ.699 తో రీచార్జ్ ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాలింగ్ సహా హైస్పీ్ డేటా, 20కి పైగా OTT సబ్ స్క్రిప్షన్లను పొందవచ్చు. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ రూ.699 రీచార్జ్ ప్లాన్ తో అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. రోజుకు 3GB హైస్పీడ డేటా కూడా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100 SMS లు, 5G నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల్లో మీ స్మార్ట్ ఫోన్ సపోర్టు చేస్తే అన్ లిమిటెడ్ డేటాను వినియోంచుకోవచ్చు. 
OTT బెనిఫిట్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్ టెట్ Xstream ప్లే సహా 20 కి పైగా OTT యాప్ లను వినియోగించుకోవచ్చు. Wynk Music, Airtel Caller Tuneలను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. 

ఎయిర్ టెల్ రూ.499 తో రీచార్జ్ ప్లాన్ 

ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ కాల్స్, డేటాతోపాటు OTT లను కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్ లో భాగంగా 3GB హైస్పీడ్ డేటా, మూడు నెలల పాటు డిస్నీ+హాట్స్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ఈ ప్లాన్ లో భాంగా అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMSలు, అన్ లిమిటెడ్ 5G డేటా వినియోగించుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 28 రోజులు. 

ఎయిర్ టెల్ రూ.899 తో రీచార్జ్ ప్లాన్ 

ఎయిర్ టెల్ రూ.899  ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తో రోజుకు 2GB డేటా, మూడు నెలల  డిస్నీ+హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. అన్ లిమిటెడ్ కాలింగ్ సహా రోజుకు 100SMS, Wynk మ్యూజిక్, free Hellotunes ను పొందవచ్చు. మీ హ్యండ్ సెట్ 5G సపోర్ట్ చేస్తే  అన్ లిమిటెడ్ డేటా వినియోగించవచ్చు.