91 శాతం పెరిగిన ఎయిర్​టెల్​ లాభం

91 శాతం పెరిగిన ఎయిర్​టెల్​ లాభం

న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్​ ఎయిర్​టెల్​కు పోయిన ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​లో కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన రూ.1,588 కోట్ల లాభం వచ్చింది. 2021 డిసెంబరు క్వార్టర్​ లాభంతో పోలిస్తే ఇది రూ.91.5 శాతం పెరిగింది. పోర్ట్‌‌‌‌ఫోలియో అంతటా నిలకడైన పనితీరు అందించడం ద్వారా మొత్తం ఆదాయం సంవత్సరానికి దాదాపు 20 శాతం పెరిగి రూ. 35,804 కోట్లకు చేరుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  

‘‘ఆదాయం సీక్వెన్షియల్​గా 3.7 శాతం పెరిగింది. ఇబిటా మార్జిన్ 52 శాతానికి విస్తరించింది. ఈ క్వార్టర్లో  64 లక్షల మంది 4జీ కస్టమర్లను సంపాదించాం.  ఒక్కో కస్టమర్​ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్​పీయూ) రూ. 193 వరకు ఉంది. పోస్ట్‌‌‌‌పెయిడ్, ఎంటర్‌‌‌‌ప్రైజ్, హోం, అలాగే ఆఫ్రికా వ్యాపారం బాగున్నాయి. డీటీహెచ్​ వ్యాపారం ఒత్తిడిలో ఉంది”అని సంస్థ ఎండీ గోపాల్​ విఠల్​ చెప్పారు. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు,  కీలకమైన గ్రామీణ ప్రాంతాలకు 5జీని తెస్తామని వెల్లడించారు.