
బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఆఫ్ స్క్రీన్ లో అమ్మాయిలతో తెగ హంగామా చేస్తుంటాడు . లేటెస్ట్ గా ముంబైకి వచ్చిన హాలీవుడ్ సింగర్ కేటీ ఫెర్రీకి కరణ్ వెల్ కమ్ పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీకి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్ వచ్చి తెగ హడావిడి చేశారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, అర్జున్ కపూర్ , మలైకా అరోరా, ఆదిత్య రాయ్ కపూర్, షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్, అనుష్క శర్మ, అనన్య పాండే, సన్యా కపూర్ అందరూ కనిపించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కాజోల్ దేవ్ గన్ కూడా కనిపించారు. కెటీతో ఫోటోల కోసం బాలీవుడ్ హీరోయిన్లు పోటీపడుతూ.. సాన్నిహిత్యం కోసం తెగ ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కెటీ తో ఫోటో దిగిన ఐశ్వర్య తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది.



