అమల్లోకి రైల్వే కొత్త రూల్.. ఇన్నాళ్లూ ఫైన్తో సరిపెట్టారు.. ఇకపై రైలు నుంచి దించేస్తారు..!

అమల్లోకి రైల్వే కొత్త రూల్.. ఇన్నాళ్లూ ఫైన్తో సరిపెట్టారు.. ఇకపై రైలు నుంచి దించేస్తారు..!

రైలు ప్రయాణికులకు భారత రైల్వే శాఖ ముఖ్య గమనిక చేసింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తే భారీ జరిమానాతో పాటు రైలు నుంచి నిర్ధాక్షిణ్యంగా దింపేయడం జరుగుతుందని రైల్వే ప్రకటించింది. టికెట్ ఖాయం చేసుకుని ప్రయాణం చేస్తు్న్న రైలు ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. 

ఇప్పటికీ కొందరు రైలు ప్రయాణికులు టికెట్ కన్ఫార్మ్ కాకపోయినప్పటికీ వెయిటింగ్ టికెట్తో రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి వెయిటింగ్ టికెట్కు కూడా ఎంతో కొంత చట్టబద్ధత ఉంటుందనే నమ్మకం వీళ్లది. టీటీ వచ్చినా ఆ టికెట్ చూపించి ఫైన్ అమౌంట్ కట్టి హాయిగా ప్రయాణం చేస్తుంటారు. 

రైల్వే తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఇలా ప్రయాణించడం కుదరదు. రిజర్వ్డ్ కోచుల్లో టికెట్ కన్ఫార్మ్ కాకుండా ప్రయాణం చేస్తే ఫుల్ టికెట్ ఫేర్తో పాటు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. రైలు నుంచి దించేసే అధికారం ట్రైన్ టికెట్ ఎగ్జామినర్కు (TTE) ఉంది. మే 1, 2025 నుంచి రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని రైల్వే శాఖ సూచించింది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. రిజర్వ్డ్ సీట్లలో ప్రయాణించే అర్హత కన్ఫర్మ్డ్ టికెట్స్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఉంటుంది.

ALSO READ | పౌరసత్వం కేసు: అలహాబాద్ హైకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్

ఇక.. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక ఏంటంటే.. వేసవి సెలవులకు తిరుపతి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో చర్లపల్లి, తిరుపతి మధ్య 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 7 నుంచి జూన్​25వ తేదీ వరకు చర్లపల్లి నుంచి 8 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపింది. ప్రతి రోజూ సాయంత్రం 6.50 గంటలకు స్పెషల్​ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించింది.

అలాగే మే 8 నుంచి స్పెషల్ ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం 4.55 గంటలకు స్పెషల్​ట్రైన్​తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చర్లపల్లి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని స్పష్టం చేశారు.1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్​కోచ్లు అందుబాటులో ఉంటాయన్నారు.