
ముంబై: కెరీర్ ప్రారంభంలో కాస్త తడబడినా.. ఆ తర్వాత తన ఇమేజ్‌ని పెంచే పాత్రలే చేసుకుంటూ వచ్చింది ఐశ్వర్యా రాయ్. ఆచితూచి కానీ ఓ సినిమాని యాక్సెప్ట్ చేయదు. అయితే తనను హీరోయిన్‌గా పరిచయం చేసిన మణిరత్నం సినిమా అంటే మాత్రం కాదనదు. ‘ఇద్దరు’ సినిమాతో ఐష్‌ని వెండితెరకు ఇంట్రడ్యూస్ చేశారు మణి. తర్వాత వీరి కాంబినేషన్‌లో ‘రావణ్’ సినిమా వచ్చింది. ఇప్పుడు మూడోసారి ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం పని చేస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ లో నందిని, మందాకినీ దేవి అనే రెండు పాత్రల్లో నటిస్తోంది ఐష్. వీటిలో ఒకటి నెగిటివ్ రోల్. విక్రమ్, జయం రవి, త్రిష ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. కొన్ని సీక్వెన్సెస్ తప్ప మిగతా షూట్ అంతా పూర్తయ్యింది. బ్యాలెన్స్ వర్క్‌ని ముంబైలో కంప్లీట్ చేయబోతున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్‌లో ఐశ్వర్యతో పాటు కార్తి కూడా పాల్గొనబోతున్నాడు. దీని తర్వాత ఐష్ ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేయనుందంటూ బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒకటి పూర్తయ్యాకే ఇంకొకటి చేస్తుంది కనుక ఆ వివరాలు తెలియడానికి కాస్త టైమ్ పట్టే చాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే పొన్నియిన్ పనిలోనే బిజీగా ఉంది ఐష్.