ఫర్హానా ధైర్యాన్ని ఇచ్చింది : ఐశ్వర్య రాజేష్

ఫర్హానా ధైర్యాన్ని ఇచ్చింది : ఐశ్వర్య రాజేష్

ఐశ్వర్య రాజేష్ లీడ్‌‌ రోల్‌‌లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఫర్హానా’. నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌‌ బ్యానర్‌‌‌‌పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ఐశ్వర్య రాజేష్​ మాట్లాడుతూ ‘నాకిది చాలా స్పెషల్ మూవీ. దర్శక నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకం  ధైర్యాన్ని ఇచ్చింది.  ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ మూడు భాషల్లో విడుదల కావడం పెద్ద విషయం. నెల్సన్  చిత్రాలు యూనిక్‌‌గా ఉంటాయి. ఇది కూడా చాలా డిఫరెంట్ మూవీ.

అన్నీ లైవ్ లొకేషన్స్‌‌లో షూట్ చేశాం. నేను  ఇంటెన్స్ రోల్‌‌లో కనిపిస్తా. షూటింగ్ కి వెళ్లినప్పుడు సవాల్‌‌గా ఉండేది. తెలుగు ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ  ‘‘ఫర్హానా’  మంచి కంటెంట్ ఉన్న చిత్రం. ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటించింది. జస్టిన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ ఒక ఎస్సెట్. నా మూడో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు   పరిచయమవడం ఆనందంగా ఉంది’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడదగ్గ సినిమా ‘ఫర్హానా’ అన్నారు నిర్మాత ఎస్.ఆర్.ప్రభు. ఐశ్వర్య దత్తా, జస్టిన్ ప్రభాకర్, జితన్ రమేష్ పాల్గొన్నారు.