
- ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థకు గతేడాది వచ్చిన లాభాలను ప్రకటించి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం మందమర్రి ఏరియా కాసిపేట-1గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎండీతో జరిగిన గత స్ట్రక్చర్ మీటింగ్‌లో కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని చేసిన డిమాండ్‌కు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని, కావాల్సిన భూమి కోసం సర్కార్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు.
పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్యాజమాన్యమే చెల్లించాలని కోరామన్నారు. డిస్మిస్ అయిన జేఎంఈటీలను తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవడానికి సర్క్యులర్ జారీ చేయించామన్నారు. డిస్మిస్అయిన ఇతర ఉద్యోగులు ఐదేండ్లలో 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగంలో చేరేలా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లు,ఈపీ ఆపరేటర్లు మెడికల్ ఇన్వాలిడేషన్అయితే సూటబుల్ జాబ్ఇవ్వడం, ఖాళీగా ఉన్న క్లర్కులు, ఏరియా ఆసుపత్రి పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. గనుల్లో సేఫ్టీ మెటిరియల్ అందించాలని, కాసిపేట గనిలో రెస్ట్ హాల్, లాకర్ బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా పలువురు గని సూపర్వైజర్లు ఏఐటీయూసీలో చేరారు. సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర సెక్రటరీ ఎండీ.అక్బర్అలీ, బెల్లంపల్లి, మందమర్రి బ్రాంచీల సెక్రటరీలు దాగం మల్లేశ్, సలెంద్ర సత్యనారాయణ, ఇన్చార్జి చిప్ప నర్సయ్య, బ్రాంచి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.