
హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్ పరికరాల తయారీ సంస్థ అజాక్స్ ఇంజినీరింగ్ తన స్వంత 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ మెషీన్‌ను ప్రారంభించింది. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. దీంతో మూడు రోజుల్లో 350 చదరపు మీటర్ల ఇంటిని నిర్మించవచ్చు. సంప్రదాయ నిర్మాణ పద్ధతుల్లో ఇంటిని నిర్మించడానికి నెలల తరబడి సమయం పడుతుంది.
అజాక్స్3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వేగవంతమైన, తక్కువ ఖర్చుతో, పర్యావరణపరంగా అనుకూలంగా నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది. అజాక్స్3డీ కాంక్రీట్ ప్రింటర్ పెద్ద సంఖ్యలో ఇళ్లతో కూడిన ప్రాజెక్టులకు కూడా అనువుగా ఉంటుంది. విల్లాలు, పోస్టాఫీసులు, అగ్నిమాపక కేంద్రాలు, విండ్ టర్బైన్‌ల వంటివి కూడా దీంతో నిర్మించవచ్చు.