Shaitaan OTT: OTTకి బ్లాక్ బస్టర్ హారర్ మూవీ సైతాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Shaitaan OTT: OTTకి బ్లాక్ బస్టర్ హారర్ మూవీ సైతాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్(Ajay devgan) హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్(Shaitaan). దర్శకుడు వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ కీ రోల్స్ చేశారు. మార్చి 8న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హారర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను వణికించాయి. దాంతో.. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది సైతాన్.

అయితే.. ఈ సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్న క్రమంలో సైతాన్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‍ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మే 3న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చేస్తున్న ఆడియన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.