ENG vs IND: బుమ్రాని అందుకే టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు: అగార్కర్ షాకింగ్ కామెంట్స్

ENG vs IND: బుమ్రాని అందుకే టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు: అగార్కర్ షాకింగ్ కామెంట్స్

రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియా రెడ్ బాల్ కెప్టెన్ గా జస్ప్రీత్ పేరును ఖరారు చేయడం ఖాయమనుకున్నారు. రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో హిట్ మ్యాన్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ముందు వరుసలో ఉంటాడు. అయితే  రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్‎ను ఎంపిక చేసింది. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‎గా శుభమన్ గిల్‎ పేరు బీసీసీఐ శనివారం (మే 24) అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది.

రోహిత్ టెస్ట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్ గా బుమ్రా భారత జట్టును నడిపించాడు. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.రోహిత్ స్థానంలో భారత కెప్టెన్ కు బెస్ట్ ఎంపిక జస్ప్రీత్ బుమ్రా అనడంలో ఎలాంటి సందేహం లేదు. బుమ్రా కెప్టెన్ కాదు కదా.. కనీసం వైస్ కెప్టెన్ గా కూడా ప్రకటించలేదు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఫిట్‌‌‌‌నెస్ సమస్యల కారణంగా ఇంగ్లాండ్ తో జరగబోయే 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు బుమ్రా అందుబాటులో ఉండటం సందేహాస్పదం కావడమే ఇందుకు కారణం.

ALSO READ | ENG vs IND: 50 మంది ఆటగాళ్లను ఎంచుకోలేము: ఆ ఒక్కడికి అన్యాయం చేసిన టీమిండియా సెలక్టర్లు

తనను ఫుల్ టైమ్ కెప్టెన్‌‌‌‌గా పరిగణించకపోవడానికి కూడా ఇదే అడ్డంకిగా మారుతోంది. బుమ్రాను ఎందుకు కెప్టెన్ గా ఎంపిక అగార్కర్ శనివారం (మే 24) విలేఖరుల సమావేశంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌లో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులో ఉండడని, దీనివల్ల అతను టెస్ట్ కెప్టెన్సీ రేసుకు దూరంగా ఉన్నాడని అన్నారు. బుమ్రా టీమిండియాకు చాలా కీలక ఆటగాడని.. అతను ఫిట్ గా ఉండాలని కోరుకుంటున్నామని అగార్కర్ తెలిపాడు. కెప్టెన్సీ చేస్తున్నపుడు అదనపు ఒత్తిడి ఉంటుందని.. బుమ్రాకు ఎక్కువగా రేస్ కావాలని ఈ సందర్భంగా అగార్కర్ చెప్పుకొచ్చాడు. 

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా రెండు మ్యాచ్‌లకు టీమిండియాకు కెప్టెన్సీ చేశాడు. పెర్త్‌లో సంచలన విజయాన్ని అందుకోగా  సిడ్నీలో భారత్ ఓడిపోయింది. అంతకముందు 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్సీ చేసిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. వచ్చే నెల (జూన్)లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత టెస్ట్ జట్టును బీసీసీఐ శనివారం (మే 24) ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని బీసీసీఐ పక్కన పెట్టింది.

ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్