
ఏ స్టార్ హీరోనైనా సినిమా పూర్తి చేయడానికి ఆరు నెలలు లేదా ఓ సంవత్సరం తీసుకుంటారు. కానీ తమిళ స్టార్ హీరో అజిత్ ఓ సినిమాను 40 రోజుల్లో పూర్తి చేసి అందరికీ షాకిచ్చాడు. అజిత్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో..ఎంత హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. మామాలూగా ఒక్క సినిమాకు ఆరు నెలలు టైం తీసుకునే అజిత్ తన కొత్త సినిమా ‘నేర్ కొండ పార్వై‘ ను నెలన్నర లోపే పూర్తి చేశాడు. అజిత్ కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తయిన మూవీ ఇదేట. ఇంత వరకు ఏ స్టార్ హీరో కూడా ఇంత త్వరగా సినిమాను పూర్తి చేయలేదు.
హిందీలో ఘనవిజయం సాధించిన ‘పింక్’ కు రీమేక్ గా అజిత్ చేస్తున్నమూవీ ‘నేర్‌కొండ పార్వై’. శ్రీదేవి భర్త బోనీకపూర్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ వినోద్. ఫిబ్రవరి మధ్యలో సినిమా షూటింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ మొదటి వారానికల్లా పూర్తి చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువగా సన్నివేశాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరించారట. ఆగస్టు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.