
సంక్రాంతికి కచ్చితంగా వస్తుందనుకున్న అజిత్ మూవీ ‘వలీమై’ వాయిదా పడడంతో నిరాశ పడ్డారు అభిమానులు. అయితే అజిత్ మాత్రం ఈ సినిమా రిలీజ్, రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఇదే టీమ్‌తో తన నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘వలీమై’ దర్శకుడు హెచ్.వినోద్, నిర్మాత బోనీకపూర్‌లతోనే అజిత్ కొత్త సినిమా ఉండబోతోంది. అజిత్ కెరీర్‌లో ఇది 61వ చిత్రం. ఇదో యాక్షన్ థ్రిల్లర్. అంతేకాదు ఇందులో అజిత్ నెగిటివ్ టచ్ ఉండే క్యారెక్టర్‌లో నటించబోతున్నాడట. వాలి, వరలారు, బిల్లా, మంగాత్త సినిమాల్లో ఇలాంటి నెగిటివ్ షేడ్ క్యారెక్టర్స్ పోషించిన అజిత్ .. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నెగిటివ్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన దర్శకుడు వినోద్, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌పై ఫోకస్ పెట్టాడు. మార్చి 9న ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని.. దీనికోసం ఓ భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఏడు నెలల పాటు రకరకాల లొకేషన్స్‌లో షూటింగ్ చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా నెగిటివ్ క్యారెక్టర్స్‌తోనూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న అజిత్, ఈసారి ఎలాంటి క్యారెక్టర్‌తో రాబోతున్నాడో చూడాలి!