టాస్తో పనిలేదు..టీమిండియాదే విజయం

టాస్తో పనిలేదు..టీమిండియాదే విజయం

ఆసియాకప్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్థాన్ మధ్య మరికొద్ది గంటల్లో మ్యాచ్ జరగనుంది. ఈ ఉత్కంఠపోరులో ఏ జట్టు విజయం సాధిస్తుందో అని అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా మాత్రం..టీమిండియాదే విజయమంటున్నాడు. భారత్ పాక్ మ్యాచ్లో ఖచ్చితంగా భారతే గెలుస్తుందని చెబుతున్నాడు. 

టాస్ ఓడినా..గెలుపు భారత్దే..
ఇండియా పాక్ మ్యాచులో భారతే ఫేవరెట్ అని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో  టాస్ గెలిచినా ఓడినా..టీమిండియానే విజయం సాధిస్తుందని చెబుతున్నాడు. పాక్ ప్రధాన పేసర్..షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరం అవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ అని చోప్రా తెలిపాడు. దీని వల్ల పాక్ విజయం సాధించే అవకాశం కోల్పోయిందన్నాడు. శ్రీలంతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా షాహీన్ షా అఫ్రిది మోకాలికి గాయం అయింది. దీంతో అతను ఆసియాకప్ నుంచి  వైదొలిగాడు. దీంతో షాహీన్ అఫ్రిది ప్లేస్లో మహ్మద్ హస్నైన్ జట్టులోకి వచ్చాడు.

పాక్ను భారత్ ఓడించగలదు..
“దుబాయ్‌లోని పిచ్‌లో చాలా పచ్చిక ఉంది. పేసర్‌లకు సహాయం చేస్తుంది. షాహీన్ అఫ్రిది లేకపోవడం పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.  దుబాయ్‌లో 'టాస్ గెలవండి, మ్యాచ్ గెలవండి' అని వారు అంటున్నారు, అయితే షాహీన్ లేకపోవడం పాక్ బౌలింగ్ కు పెద్ద లోటు. కాబట్టి టాస్ ఓడినా కూడా పాకిస్తాన్‌ను భారత్ ఓడించగలదని నేను భావిస్తున్నాను, అని ఆకాష్ చోప్రా తెలిపాడు. 

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్.

పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, నసీమ్ షా, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్.