Sarkaru Naukari OTT: ఓటీటీకి వచ్చేస్తున్న సర్కారు నౌకరి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sarkaru Naukari OTT:  ఓటీటీకి వచ్చేస్తున్న సర్కారు నౌకరి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సింగర్ సునీత (Sunitha) కొడుకు ఆకాష్ (Akash)​ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన మూవీ సర్కారు నౌకరి(Sarkaru Naukari). జనవరి 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ కథ పరంగా ఆడియన్స్ను మెప్పించిన..కలెక్షన్స్ పరంగా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేదు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సర్కారు నౌకరి ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజైన ఇరవై ఐదు రోజుల్లోనే అనగా..జనవరి 26న ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) సొంతం చేసుకుంది. సర్కారు నౌకరి మేకర్స్ త్వరలో ఓటీటీ రిలీజ్ డేట్‌ ప్రకటించే అవకాశం ఉంది. 

సర్కారు నౌకరు అంటే..సర్కారీ జీతం తీసుకోవడం కాదు..ప్రజలకు సేవ చేయడం..అంటూ కథాంశంతో వచ్చిన మూవీ ఓటీటీ ఆడియాన్స్ ను ఏ విధంగా ఆకట్టుకుంటోంది చూడాలి. ఈ మూవీకి డైరెక్షన్,సినిమాటోగ్రఫీ బాధ్యతలు గంగనమోని శేఖర్ నిర్వహించగా..లెజెండరీ డైరెక్టర్ కే.రాఘవేంద్రరావుకు చెందిన ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మించారు

కథ విషయానికి వస్తే.. 

సర్కారు నౌకరి సినిమాలో ఆకాష్ గోపరాజు నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాలో ప్రజల్లో భయాందోళన కలిగిన ఎయిడ్స్‌ వంటి వ్యాధి పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగిగా నటించాడు. ఇందులో కండోమ్‌లు పంచే ఉద్యోగం చేస్తున్న అతడికి సొసైటీ నుంచి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి. చివరికి అతడు చేసే ఉద్యోగం వల్లనో, మరే ఇతర కారణం వల్లనో ఊళ్లోకి రావద్దంటూ వార్నింగ్ ఇవ్వడం..గవర్నమెంట్ ఉద్యోగిని చేసుకున్న అనే గర్వంతో ఉన్న భార్య కూడా అతనికి ఎందుకు దూరమైంది? అసలు  ఎయిడ్స్‌ వ్యాధి పై అవగాహన కల్పించే ఉద్యోగమే గోపాల్ చేయడానికి అస్సలు కారణం ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోండి.