
- 15 వేల అడుగుల ఎత్తులో ట్రాక్ చేసి లక్ష్యాలను ఛేదించిన మిసైల్
న్యూఢిల్లీ: ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే ఆకాశ్ అప్ గ్రేడెడ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. 15 వేల అడుగుల ఎత్తులో రెండు లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. ఆకాశ్ మార్క్1 శ్రేణిలో ఆకాశ్ ప్రైం కొత్త వేరియంట్. మానవరహిత ఏరియల్ టార్గెట్లను ఇది అత్యంత కచ్చితత్వంతో తునాతునకలు చేసింది. అంత ఎత్తులో ఆకాశ్ ప్రైం క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి.
4,500 మీటర్ల ఎత్తులో పనిచేసేలా ఈ ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశీయంగా డెవలప్ చేసిన రేడియో ఫ్రీకెన్సీ సీకర్‌తో ఈ మిసైల్‌ను అప్ గ్రేడ్ చేశారు. రేడియో సిగ్నల్స్‌ను రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ట్రాన్స్ మిట్ చేసి లక్ష్యాలను ట్రాక్ చేసి ధ్వంసం చేస్తుంది. దీని పరిధి 20 కిలోమీటర్లు. ఈ క్షిపణి అభివృద్ధిలో డీఆర్డీవో మాజీ సైంటిస్టు ప్రహ్లాద రామారావు కీలక పాత్ర పోషించారు.