వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ : అక్బరుద్దీన్‌ ఒవైసీ

 వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ : అక్బరుద్దీన్‌ ఒవైసీ

ఎంఐఎం పార్టీకి ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అన్న మంత్రి కేటీఆర్ కామెంట్లను సీరియస్ గా తీసుకుంటున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ అంశంపై పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీతో చర్చిస్తామని చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఒవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏడుగురుతో కాకుండా కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెడతామని అక్బరుద్దీన్‌ స్పష్టం చేశారు. ఈ సారి ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని బీఆర్ఎస్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు.