అఖండ.. అన్నీ స్పెషలే!

అఖండ.. అన్నీ స్పెషలే!

రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయ్యారు బాలకృష్ణ. ‘అఖండ’పై భారీ అంచనాలు ఏర్పడడానికి
కారణం అదే. ఆ ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్‌‌‌‌కి తగ్గట్టుగానే బోయపాటి సినిమాని అన్ని విషయాల్లోనూ ప్రత్యేకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడని రీసెంట్‌‌‌‌గా రిలీజైన ట్రైలర్
చూస్తే అర్థమయ్యింది. బాలయ్య గెటప్‌‌‌‌ నుంచి డైలాగ్స్ వరకు అన్నీ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉండేసరికి ఫ్యాన్స్‌‌‌‌లో జోష్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో ఇంకా
చాలా స్పెషల్స్ ఉన్నాయట. రీసెంట్‌‌‌‌గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిడివి రెండు గంటల నలభయ్యేడు నిమిషాలు ఉందట. అంటే దాదాపు
మూడు గంటల పాటు అభిమానులకి మాస్‌‌‌‌ ఫీస్టేనన్నమాట. పైగా అందులో నలభై అయిదు నిమిషాలు యాక్షన్ సీన్స్‌‌‌‌కే కేటాయించారట. సింహా, లెజెండ్
సినిమాల్లో లాగే ఈ సినిమాలోనూ ఒక క్యారెక్టర్ ఫ్లాష్‌‌‌‌బ్యాక్‌‌‌‌లోనే వస్తుందట. అక్కడి నుంచి సినిమా మరో లెవెల్‌‌‌‌కి వెళ్తుందని, ఫ్యాన్స్‌‌‌‌కి గూజ్ బంప్స్
వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి టైటిల్‌‌‌‌ దగ్గర్నుంచి సినిమా నిడివి వరకు అన్నింట్లోనూ ‘అఖండ’ ప్రత్యేకంగానే కనిపిస్తున్నాడు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 2న  
మూవీ రిలీజ్. త్వరలో జరగనున్న ప్రీ రిలీజ్‌‌‌‌కి ఎన్టీయార్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాడనేది ఇంకో స్పెషల్ న్యూస్. ఆ తర్వాత గోపీచంద్‌‌‌‌ మలినేని డైరెక్షన్‌‌‌‌లో
నటించనున్నారు బాలయ్య. ఇందులో కూడా డ్యూయెల్ రోలేనట. ఒక పాత్ర ఎన్నారై కావడంతో సినిమా ఎక్కువ భాగం యూఎస్‌‌‌‌లో తీస్తారట. అంటే నెక్స్ట్‌‌‌‌
మూవీ కూడా స్పెషలే అన్నమాట.