Akhil Agent OTT: ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

 Akhil Agent OTT: ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ అక్కినేని (Akhil) నటించిన ఏజెంట్( Agent) మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా భారీ స్థాయిలో తెరకెక్కింది.  ఏజెంట్ బడ్జెట్ దాదాపు 80 కోట్లు. కానీ వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. పెట్టిన బడ్జెట్ లో 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది ఏజెంట్ మూవీ. దీంతో కోలుకోలేని డిజాస్టర్ ను చవిచూశారు అనిల్ సుంకర.

గత ఏడాది 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ..ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఏడాది కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. అసలు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది అటు ఆడియాన్స్ కు..మేకర్స్ కు ఆసక్తికరంగా మారింది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ పై ఓ స్ప్రష్టత వచ్చినట్లు సమాచారం. ఈ నెల 2024 జనవరి 26 నుంచి సోనీలివ్(Sony Liv) ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 రోజునే తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ అవనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోనీలివ్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.

థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే ఓటీటీ వెర్షన్‌లో ఏజెంట్ మూవీలో చాలా వరకు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది. థియేటర్లో భారీ డిజాస్టర్ గా నిలిచినా అఖిల్..ఓటీటీ ప్రేక్షలను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి మరి. 

ఏజెంట్ ఓటీటీ ఆలస్యం ఎందుకు అవుతుంది? 

ఇప్పటికే సోనీలివ్ రెండు సార్లు అఫీషియల్‌గా ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది. కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా  తరుచూ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏజెంట్ సినిమా హక్కులను సోనీలివ్‌ సంస్థకు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర అమ్ముకున్నాడంటూ వారు ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసు కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోన్నట్లు సమాచారం.