అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. బుధవారం అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. అఖిల్ చిరునవ్వుతో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇక మే 1న ఈ సినిమా విడుదల కావల్సి ఉండగా ‘పెద్ది’ చిత్రం కోసం జూన్ 26కు తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ఇటీవల ప్రకటించారు.
అయితే తదనంతర పరిణామాలతో విడుదల తేదీలో మార్పులు ఉంటాయనే ప్రచారం జరిగింది. కానీ అఖిల్ బర్త్ డే పోస్టర్ ద్వారా మరోసారి ఈ డేట్‌ను కన్‌ఫర్మ్ చేశారు. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
