
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో లవర్ బాయ్‌గా కనిపించిన అఖిల్, నెక్స్ట్ మూవీ ‘ఏజెంట్’లో పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా కనిపించబోతున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జెట్ స్పీడుతో జరుగుతోంది. కీలక పాత్ర పోషిస్తున్న మమ్ముట్టి కూడా ఇటీవల సెట్‌లో జాయినయ్యారు. నిన్న రిలీజ్ డేట్‌ని సైతం అనౌన్స్ చేశారు. ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. దేశభక్తి ఆధారంగా సాగే సినిమా కావడంతో ఈ డేట్‌కి ఫిక్సయ్యామంటున్నారు మేకర్స్. లాంగ్ వీకెండ్‌తో పాటు పంద్రాగస్టు సెలవు కూడా ఉండటం కలిసొచ్చే అంశం . వక్కంతం వంశీ కథతో స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. అతని క్యారెక్టర్‌ను బట్టి ‘ద వైల్డ్ వన్’ అని పిలుస్తారట. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. హిప్ హప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. సురేందర్ రెడ్డితో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, దీపారెడ్డి కో ప్రొడ్యూసర్స్. ఇక ఆగస్టు 11న ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్ధా’ రిలీజ్ కానుంది. ఇందులో నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. అంటే అన్నదమ్ములు ఇద్దరూ ఒకే టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర కలుసుకోనున్నారు.