మగధీర, కెజీఎఫ్ తరహాలో అఖిల్ "ధీర"

మగధీర, కెజీఎఫ్ తరహాలో అఖిల్ "ధీర"

అఖిల్ అక్కినేని తన తరువాతి సినిమా కోసం మగధీర, కేజీఎఫ్ సినిమాలను గట్టిగా వాడేస్తున్నాడు. ఇందుకోసం ప్రభాస్ హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. ప్రభాస్ హీరోగా వచ్చిన'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగులో జరుగుతున్నాయని తెలుస్తోంది.

అయితే..   ఈ సినిమా నుండి వినిపిస్తున్న  లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. సినిమాకి  టైటిల్ ఫిక్స్ చేశారట మేకర్స్. అక్కినేని అఖిల్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా కోసం అంతే పవర్ఫుల్ టైటిల్'ధీర' ని ఫిక్స్ చేశారట. పీరియాడికల్ అండ్ యాక్షన్ డ్రామాగా రానున్న ఈ సినిమాకి ధీర అనే పవర్ఫుల్ టైటిల్ అయితేనే బాగుంటుందని డిసైడ్ అయ్యారట మేకర్స్. అయితే ఈ సినిమా కథ కోసం బ్లాక్ బస్టర్ సినిమాలు మగధీర, కేజీఫ్ లను వాడేస్తున్నారట.

ధీర సినిమా కోసం మగధీర సినిమాలోలా అదిరిపోయే పీరియాడికల్ ఫ్లాష్ బ్యాక్ ని సెట్ చేశారట. అంతేకాదు.. హీరోకి కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్స్ కూడా ప్లాన్ చేశారట. ఇక ఈ రెండు గనుక సెట్ అయితే.. మరో పాన్ ఇండియా రేంజ్ బ్లాక్ బాస్టర్ అవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అఖిల్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ యాక్ట్ చేయనుంది. మరి ఈ సినిమాతో అయినా అఖిల స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి మరి.ఈ సినిమాకి సంబంధిచిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.