
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేండ్లపాటు పేదలకు ఫ్రీగా రేషన్‌తో పాటు కిలో నెయ్యి పంపిణీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హామీ ఇచ్చారు. మంగళవారం రాయ్‌బరేలిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘మునుపు పవర్లో ఉన్నప్పుడు రేషన్ ఇచ్చినం. ఎస్పీ సర్కారు ఉన్నంతకాలం పేదలకు ఫ్రీగా రేషన్ ఇచ్చుడే ఉంటది. బంజేసుడు ఉండదు. దాంతోపాటు ఆవాల నూనె, ఏడాదికి రెండు సిలిండర్లు, పేదల ఆరోగ్యం మెరుగుపడేందుకు నెయ్యి కూడా ఇస్తం” అని అఖిలేశ్ అన్నారు. బీజేపీ హయాంలో ఈ ఎన్నికలదాకానే రేషన్ అందుతదని, ఆ తర్వాత ఇచ్చుడు ఆగిపోతుందని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రేషన్‌కు ఫండ్స్ కేటాయించకపోవుడే అందుకు ఉదాహరణ అని అఖిలేశ్ చెప్పారు.