వ్యాక్సిన్ తీసుకుంటానన్నఅఖిలేష్ యాదవ్

వ్యాక్సిన్ తీసుకుంటానన్నఅఖిలేష్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్  కరోనా వ్యాక్సిన్ విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో .. తాను కరోనా టీకా తీసుకోబోనని, అది  బీజేపీ వ్యాక్సిన్ అని అన్నారు. అయితే  ప్రధాని మోడీ ప్రకటన క్రమంలో ఇవాళ(మంగళవారం) అఖిలేష్ ట్విటర్ వేదికగా స్పందించారు. తాను ఈ వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పారు. అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటూ పిలుపునిచ్చారు.

తాము బీజేపీ వ్యాక్సిన్‌కు వ్యతిరేకమని.. భారత ప్రభుత్వ వ్యాక్సిన్‌ను స్వాగతిస్తామని చెప్పారు అఖిలేష్ యాదవ్. తాను వ్యాక్సిన్ వేయించుకుంటానని.. వ్యాక్సిన్ కొరత కారణంగా టీకాను తీసుకోలేకపోయినవారంతా టీకాను తీసుకోవాలని కోరారు.

మోడీ నిన్న(సోమవారం) జాతినుద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతుందని తెలిపారు. దేశంలోని వయోజనులందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామన్నారు.