అఖిలేష్ యాదవ్ కాన్వాయ్కు ప్రమాదం

అఖిలేష్ యాదవ్ కాన్వాయ్కు ప్రమాదం

యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్‌లోని హర్డోయ్ జిల్లాలోఈ ఘటన జరిగింది. హర్‌పాల్‌పూర్‌లోని బైతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు అఖిలేష్ యాదవ్‌ వెళ్తున్నారు. ఫర్హత్ నగర్ రైల్వే క్రాసింగ్ సమీపంలోని మలుపు వద్ద అఖిలేష్‌ యాదవ్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు దెబ్బతినగా.. పలువురు వ్యక్తులు గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అఖిలేష్ యాదవ్ కు ఏమికాలేదు. ఘటన అనంతరం ఆయన షెడ్యూల్ ప్రకారం తన ప్రోగ్రామ్‌కు వెళ్లారు.