
జూనియర్ పవర్ స్టార్ అకీరానందన్ కల్కి 2898 ఏడీ సినిమాకు వచ్చారు. అది కూడా కల్కి ట్ షర్ట్ లో. ఆయన ఈరోజు విడుదలైన ప్రభాస్ కల్కి సినిమా చూసేందుకు హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ కి వచ్చారు. దాంతో.. అకీరాను చూసేందుకు, ఆయనతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. దాంతొ.. థియేటర్స్ మెయిన్ గేట్ నుండి కాకుండా.. సెల్లార్ నుండి థియేటర్ లోపలికి వెళ్లారు అకిరా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే.. అకీరానందన్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే.. కల్కి సినిమాకుక్ ఫస్ట్ షోకి రావడం, అది కూడా కల్కి టీ షర్ట్ తో రావడంతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అంతేకాదు.. అకిరానందన్ కూడా రెబల్ స్టార్ ఫ్యాన్ అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అకీరాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అవుతున్నాయి.
Akira kuda manode Rebels ??
— Roaring REBELS (@RoaringRebels_) June 27, 2024
Kalki Tshirt ?#Blockbusterkalki #Kalki2898AD #Prabhas pic.twitter.com/ttxTXOo8hR
ఇక కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే.. రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్వన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. విడుదల తరువాత ఆ అంచనాలను అందుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యింది. కథ, కథనం, విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతానికి లింక్ చేసిన విధానం, భవిష్యత్ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన తీరుకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో.. రానున్న రోజుల్లో ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.