Akhil Agent Movie: ఆన్‌లైన్‌లో లీకైన ఏజెంట్ తెలుగు వెర్ష‌న్..ఓటీటీలో రిలీజ్ కాకుండానే అఖిల్ దర్శనం

Akhil Agent Movie: ఆన్‌లైన్‌లో లీకైన ఏజెంట్ తెలుగు వెర్ష‌న్..ఓటీటీలో రిలీజ్ కాకుండానే అఖిల్ దర్శనం

అఖిల్ అక్కినేని (Akhil) నటించిన ఏజెంట్( Agent) మూవీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా భారీ స్థాయిలో తెరకెక్కింది. ఏజెంట్ బడ్జెట్ దాదాపు 80 కోట్లు. కానీ వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. పెట్టిన బడ్జెట్ లో 10 శాతం కూడా రికవరీ చేయలేకపోయింది ఏజెంట్ మూవీ. దీంతో కోలుకోలేని డిజాస్టర్ను చవిచూశారు అనిల్ సుంకర.అయితే, ఈ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఆన్‌లైన్‌లో లీక‌వ్వ‌డంపై నెటిజ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ చేస్తోన్నారు. వివరాల్లోకి వెళితే..

గతేడాది 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ..ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఏడాది కాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. సోనీలివ్(Sony Liv) ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఎప్పటినుంచో టాక్ ఉన్నప్పటికీ..వాయిదా పడుతూనే ఉంది. ఇక ఎట్టకేలకు అయ్యాగారి మూవీ  తెలుగు వెర్ష‌న్ అన్‌లైన్‌లో కొన్ని పైర‌సీ సైట్స్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లు, స్క్రీన్‌షాట్స్  ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోన్నాయి. ఇక 'వెయిట్ చేసేది ఏం లేదు..వచ్చాక చూసేది' అని కొందరు కామెంట్స్ చేస్తుండగా..' ఇక చూడటానికి ఇదొక్కటే దారి అంటూ' మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏజెంట్ మూవీ హిందీ వెర్షన్ టీవీలో టెలికాస్ట్ అయింది. మరి తెలుగు వెర్షన్ ఓటీటీలో రిలీజ్ అయ్యేదెప్పుడో తెలియాల్సి ఉంది. 

ఏజెంట్ ఓటీటీ ఆలస్యం ఎందుకు అవుతుంది? 

ఇప్పటికే సోనీలివ్ రెండు సార్లు అఫీషియల్‌గా ఏజెంట్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేసింది. కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా  తరుచూ ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల విషయంలో ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏజెంట్ సినిమా హక్కులను సోనీలివ్‌ సంస్థకు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర అమ్ముకున్నాడంటూ వారు ఆరోపించారు. దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసు కారణంగా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోన్నట్లు సమాచారం.

Also Read:-మెడికో థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో 'శివం భజే' చిత్రం