సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, అమల దంపతులు  మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 30వ తేదీ శనివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 


అంతకుముందుIIT హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి.. సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా ఆయనను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.