తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ విచారణకు టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డికి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. సిట్ విచారణకు టీటీడీ మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డికి

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసుకి సంబంధించి సిట్ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ అదనపు ఈఓ ఏ.వీ ధర్మారెడ్డి. మంగళవారం ( నవంబర్ 11 ) విచారణకు హాజరవ్వాలంటూ గతంలో సిట్ నోటీసులు జారీ చేసిన క్రమంలో ఇవాళ విచారణకు హాజరయ్యారు ధర్మారెడ్డి. కల్తీనెయ్యి సరఫరాలో ధర్మారెడ్డి పాత్రపై ఆయనను ప్రశ్నిస్తోంది సిట్. బోలేబాబా డైరెక్టర్లు, ఎ.ఆర్.డెయిరీ ప్రతినిధులతో ఎందుకు సంప్రదింపులు జరిపారన్న కోణంలో ప్రశ్నిస్తోంది సిట్.

ధర్మారెడ్డిని రెండురోజుల పాటు విచారించనుంది సిట్. ఇదిలా ఉండగా.. సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్న ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో A16 గా ఉన్న కీలక నిందితుడు అజయ్ కుమార్ సుగంద్ ను అరెస్ట్ చేసింది సీబీఐ సిట్. అజయ్ కూమార్ మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ లాంటి కెమికల్ ను బోలేబాబా  కంపెనీ కి సరఫరా చేసినట్లు గుర్తించింది సిట్. 

►ALSO READ | శ్రీశైలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి శంకుస్థాపన.. వర్చువల్ గా పాల్గొన్న సీఎం చంద్రబాబు..

లడ్డూలు తయారు చేసే నెయ్యిలో 90 శాతానికి పైగా పామాయిల్‌ వినియోగించినట్లు గుర్తించింది సిట్. పామాయిల్ తయారికి మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ లాంటి కెమికల్స్ వాడినట్లు గుర్తించింది సిట్. అజయ్ కుమార్ గత ఏడేళ్లుగా బోలే బాబాకు పామాయిల్ తయారు చేయడానికి కెమికల్స్ ను సరఫరా చేస్తున్నట్లు తెలిపింది సిట్.