పీఎం కేర్స్ ఫండ్ కు అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల భారీ విరాళం

పీఎం కేర్స్ ఫండ్ కు అక్షయ్ కుమార్ రూ.25 కోట్ల భారీ విరాళం

దేశంలో 21 రోజుల లాక్ డౌన్ విధించిన కారణంగా విరివిగా విరాళాలు ఇవ్వాలన్న ప్రధాని మోడీ విజ్ఞప్తికి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ప్రధాని ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు రూ.25 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఇప్పుడు ప్రతి విషయం దేశ ప్రజల ప్రాణాలకు సంబంధించేదన్నారు అక్షయ్ కుమార్. తాను పొదుపు చేసిన డబ్బులో నుంచి 25 కోట్ల  రూపాయలను మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు అక్షయ్.