
మలయాళ సూపర్ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ తెలుగు రీమేక్ రైట్స్‌ని రామ్ చరణ్ తీసుకున్నాడని.. పవన్ కళ్యాణ్, రవితేజ హీరోలుగా తెరకెక్కుతుందని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే తెలుగులో కంటే ముందు హిందీలో ఈ సినిమా రీమేక్ అవుతోంది. ‘సెల్ఫీ’ పేరుతో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. రాజ్ మెహ్‌తా దర్శకుడు. ఒక స్టార్ హీరోకి, వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌కి మధ్య ఇగో క్లాషెస్ చుట్టూ తిరిగే కథ. పృథ్విరాజ్ సుకుమారన్ స్టార్ హీరోగా, సూరజ్ వెంజరమ్మూడు వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా నటించారు. ఆ పాత్రల్ని హిందీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి పోషిస్తున్నారు.