KESARI CHAPTER 2 Trailer: కేసరి ఛాప్టర్ 2 తెలుగు ట్రైలర్.. గూస్‌బంప్స్‌.. జలియన్ వాలాబాగ్ ఊచకోత విజువల్స్

KESARI CHAPTER 2 Trailer: కేసరి ఛాప్టర్ 2 తెలుగు ట్రైలర్.. గూస్‌బంప్స్‌.. జలియన్ వాలాబాగ్ ఊచకోత విజువల్స్

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి ఛాప్టర్ 2: ది అన్‌‌‌‌‌‌‌‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌‌‌‌‌‌‌‌వాలా బాగ్’. ఆర్. మాధవన్, అనన్య పాండే, రెజీనా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 18న హిందీలో విడుదలైంది. సుమారు వంద కోట్ల వసూళ్లతో నాలుగో వారంలోను హౌస్​ఫుల్‌‌‌‌‌‌‌‌గా రన్ అవుతోంది. ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్‌‌‌‌‌‌‌‌ విడుదలకు రెడీ అవుతోంది. మే 23న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్‌‌‌‌‌‌‌‌ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతోంది.   

ఈ క్రమంలో నేడు శనివారం (మే17న) కేసరి ఛాప్టర్ 2 తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. "చరిత్ర మర్చిపోయిన పోరాటం. న్యాయం కోసం జరిగిన యుద్ధం.దేశం కోసం జరిగే అన్ని యుద్ధాలు యుద్ధభూమిలో జరగవు. కొంత మంది న్యాయస్థానంలో, న్యాయం కోసం పోరాడుతున్నారు. కేసరిచాప్టర్2 మే 23న తెలుగు థియేటర్లలో విడుదలవుతోంది" అని మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.

ఇందులో అక్షయ్ కుమార్ నిర్భయ న్యాయవాది సర్ సి శంకరన్ నాయర్ పాత్రను పోషిస్తున్నాడు. విషాదకరమైన జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో రూపొందించబడిన ఈ ట్రైలర్, భారత చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకదానిపై కొత్త కోణాలను చూపిస్తుంది. 

అమృత్సర్‌లో జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో తుపాకీ కాల్పులు, ప్రాణాల కోసం పారిపోతున్న మహిళలు మరియు పురుషులు కేకలు, పెరుగుతున్న ఉద్రిక్తతతో కూడిన అరాచకంపై కోర్టులో వాదనలతో ట్రైలర్ మొదలైంది. అక్షయ్ కు వ్యతిరేఖంగా వాదించడానికి మాధవన్ రంగంలోకి దిగుతాడు. వారిద్దరి మధ్య పోటాపోటినా వాదనలు జరగడం ఆసక్తిని పెంచుతోంది.

బ్రిటిష్ అరాచక సామ్రాజ్యానికి, భారతదేశంలోని అమృత్‌సర్ బాధితుల ఆర్తనాదాలకి మధ్య  సాగిన ఈ ట్రైలర్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. అక్షయ్ కుమార్ కోర్టులో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటన్నా సీన్స్ మరింత పవర్ ఫుల్ గా ఉన్నాయి. జస్ట్ ట్రైలేరే ఇలా ఉంటె సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోండి.