
సూరత్: తెలంగాణ స్టార్ ప్యాడ్లర్స్ ఆకుల శ్రీజ, ఎస్‌ఎఫ్‌ఆర్ స్నేహిత్ గుజరాత్‌లో జరుగుతున్న నేషనల్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫైనల్ చేరుకున్నారు. ఇప్పటికే విమెన్స్ టీమ్ ఈవెంట్‌లో బ్రాంజ్ నెగ్గిన శ్రీజ విమెన్స్ సింగిల్స్ లో సెమీస్ చేరి మొత్తంగా మూడో మెడల్ ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో శ్రీజ–స్నేహిత్ జంట 3–2 తేడాతో బెంగాల్‌కు చెందిన ఆకాశ్ పాల్–ప్రాప్తి సేన్ ద్వయాన్ని ఓడించి ఫైనల్ చేరింది. విమెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో శ్రీజ 4–0 ( 11–-4, 11-–6, 11–-5, 11–-4)తో వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఐహికా ముఖర్జీని ఓడించింది. సెమీస్ చేరడంతో శ్రీజకు కనీసం కాంస్యం ఖాయమైంది. కాగా, మెన్స్ సింగిల్స్‌లో స్నేహిత్ క్వార్టర్స్‌లోనే ఓడిపోయాడు. గుజరాత్ ప్లేయర్ మానుష్ షా 3–2 ( 3–-11, 11–-13, 11–-7, 11–-9, 12-–10, 11–-9)తో స్నేహిత్‌పై నెగ్గాడు.