రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్న కేసీఆర్ను ఓడించాలి: ఆకునూరి మురళి

రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్న కేసీఆర్ను ఓడించాలి: ఆకునూరి మురళి

రాష్ట్రాన్ని నిలువు దోపిడి చేస్తున్న కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో ఓడించాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. డబ్బు, మద్యానికి లోబడకుండా ఓటు వేయాలని ఆయన కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి తోమ్మిదిన్నర ఏంళ్లు గడుస్తున్నా.. వాటి ఊసే ఇప్పుడు తీయడం లేదని విమర్శించారు. 

రైతు బంధుతో రైతులందరికీ న్యాయం జరగటం లేదన్నారు. రైతులకు సబ్సిడీలు లేవని మండిపడ్డారు. 29 రాష్టాల్లో పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణా ఒక్కటేనని ఆకునూరి మురళి చెప్పారు.

తెలంగాణలో అవినీతి ఆర్థిక దోపిడీ రాజకీయాలను ఓడిద్దామని పిలుపునిచ్చారు. మత విద్వేష, విభజన నియంతృత్వ పాలనతో.. ఆదాని, అంబానీలకు సేవ చేస్తున్న వారిని ఓడిద్దామని యాదాద్రి భువనగిరి జిల్లాలో జాగో తెలంగాణ సభ్యులు తెలిపారు.