అల్​కాయిదా గ్రూపులు ప్రతీకార దాడులు చేయొచ్చు

అల్​కాయిదా గ్రూపులు ప్రతీకార దాడులు చేయొచ్చు

వాషింగ్టన్: వరల్డ్ మోస్ట్ వాంటెడ్​ టెర్రరిస్ట్, అల్‌‌‌‌‌‌‌‌ కాయిదా చీఫ్ ఐమన్ అల్ జవహరీని మట్టుబెట్టిన తర్వాత అమెరికన్లపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా ప్రజలను హెచ్చరిస్తూ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అల్‌‌‌‌‌‌‌‌కాయిదా అనుబంధ టెర్రరిస్టు గ్రూపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా పౌరులు, ఆఫీసులు టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడే అవకాశముందని తెలిపింది.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమెరికన్లు, విదేశీ టూర్లకు వెళ్లాలనుకునే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆత్మాహుతి దాడులు, హత్యలు, కిడ్నాప్‌‌‌‌‌‌‌‌లు, బాంబుపేలుళ్లు ఇలా ఏ రూపంలోనైనా విధ్వంసం సృష్టించవచ్చని చెప్పింది. ప్రస్తుత పరిస్థితికి తగ్గట్లు అమెరికా పౌరులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.