
ధర్మశాల: ఆధ్యాత్మిక గురువు దలైలామా హాస్పిటల్ లో చేరారు. ఛాతి నొప్పి రావడంతో ఆయనను బుధవారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఛాతిలో ఇన్ ఫెక‌్షన్ ఉన్నందువల్ల కొన్ని రోజులు ట్రీట్ మెంట్ అవసరమని తెలిపారు డాక్టర్లు. ప్రస్తుతం దలైలామా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణపాయం లేదన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఢిల్లీలోనే ఏప్రిల్ 6న ముగిసిన గ్లోబల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న దలైలామా, సోమవారం ధర్మశాలకు వెళ్లారు. అనారోగ్యం కారణంగా మరుసటి రోజు తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.