అలంపూరు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

అలంపూరు: పోక్సో కేసులో నిందితుడికి  20 ఏండ్ల జైలు శిక్ష

అలంపూరు, వెలుగు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ.20వేలజరిమానా విధిస్తూ ప్రిన్సిపాల్ డిస్టిక్ అండ్ స్టేషన్స్ కోర్టు జడ్జి శ్రీనివాస్  శుక్రవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలంపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై 2021 ఏప్రిల్​లో పింజరి హుస్సేన్ అలియాస్ నడిపి హుస్సేన్ లైంగికదాడి చేసినట్టు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎంక్వయిరీ చేసి కోర్టులో ఛార్జ్ సీటు నమోదు చేయించారు. పోలీసులు, గద్వాల భరోసా కేంద్ర బృందం సాక్షులను పకడ్బందీగా బ్రిఫింగ్ చేసి కోర్టులో సాక్ష్యం బలంగా చెప్పడంతో నిందితుడు నేరం చేసినట్లు రుజువు అయిందన్నారు. నిందితుడికి జడ్జి ఈ మేరకు శిక్షతోపాటు జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.