అలంపూర్, వెలుగు : ఇంటర్‌లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ప్రగటూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రగటూర్ గ్రామానికి చెందిన బోయ రాముడు చిన్న కుమార్తె చామంతి (17) ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. గురువారం వెలువడిన సప్లిమెంటరీ ఫలితాల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన చామంతి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లి రామేశ్వరమ్మ వెంటనే కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ గురువారం రాత్రి చనిపోయింది. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
