జూరాల నుంచి లిఫ్ట్ లకు పంపింగ్ స్టార్ట్.. మొదలైన విద్యుత్ ఉత్పత్తి

జూరాల నుంచి లిఫ్ట్ లకు పంపింగ్ స్టార్ట్..     మొదలైన విద్యుత్ ఉత్పత్తి

గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు వరద రాక కొనసాగుతుండడంతో లిఫ్ట్ ల నుంచి సోమవారం పంపింగ్ స్టార్ట్ చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్ 1కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద రాక కొనసాగుతోంది. దీంతో సోమవారం రాత్రి జూరాల వద్ద గల జెన్కో లోని ఒక యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టారు. కర్నాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 30 వేల  క్యూసెక్కుల నీరు జూరాలలోకి వస్తుంది. జూరాల ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 318.010 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ నుంచి మొత్తం 16,408 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్ట్ దగ్గర 492.22 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ ఉంచి.. మిగతా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.