అలీసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

అలీసాగర్ రెండు గేట్లు ఎత్తివేత

ఎడపల్లి, వెలుగు : ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్‌ నిండింది. దీంతో ఆదివారం రెండు గేట్ల నుంచి 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో రిజర్వాయర్‌ 1298 అడుగుల నీటి మట్టానికి చేరి నిండు కుండలా మారింది. 

ప్రస్తుతం నిజాంసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి మరో 1374 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అదనంగా 500 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ కాల్వల ద్వారా, మరో 50 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్‌ కేంద్రానికి తాగునీటి కోసం విడుదల చేస్తున్నారు.