National awards2023: జాతీయ ఉత్తమ నటిగా ఆలియా భట్

National awards2023: జాతీయ ఉత్తమ నటిగా ఆలియా భట్

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ బ్యూటీ ఆలీయా భట్ అవార్డు అందుకున్నారు. ఆమె నటించిన గంగూభాయ్ కతీయవాడి సినిమాకు గాను అనే ఈ అవార్డు అందుకున్నారు. 

సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో గంగూభాయ్ గా అద్భుతమైన నటనను కనబరిచింది అలియా. ముంబైలోని కతీయవాడి ప్రాంతంలోని గంగూభాయ్ అనే వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఆ పాత్రలో అలియా ఒదిగిపోయిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాను గాను జాతీయ ఉత్తమ నటిగా అలియా అవార్డు అందుకోవడం పట్ల చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.