
బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. చేతినిండా సినిమాలు ఉండటంతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఆలియా ఈ నిర్ణయం తీసుకుందని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె స్థానంలో మరో స్టార్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల 'కల్కీ2' నుంచి దీపికా పదుకొణెను తప్పించడం, ఇప్పుడు ఆలియా భట్ తప్పుకోవడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ఆలియా అవుట్...
ప్రస్తుతం ఆలియా భట్ పలు భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో ముఖ్యంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న 'లవ్ అండ్ వార్' సినిమా ఉంది, ఇందులో ఆమె రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 2026లో విడుదల కానుంది. దీంతో పాటు, అమర్ కౌశిక్ దర్శకత్వంలో మడాక్ ఫిల్మ్స్ నిర్మించనున్న 'చాముండా' ప్రాజెక్టుకు కూడా ఆలియా భారీగా డేట్స్ ఇచ్చింది. నాగ్ అశ్విన్ తన కొత్త సినిమా షూటింగ్‌ను 'చాముండ' షూటింగ్ సమయానికే ప్లాన్ చేయాలనుకోవడంతో, రెండు ప్రాజెక్టులకు డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆలియాకు అసాధ్యమైంది.
నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ 'కల్కి 2' పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తాను చేయాలనుకున్న ఈ మహిళా-ప్రధాన చిత్రాన్ని త్వరగా పట్టాలెక్కించాలని అనుకుంటున్నారు. 'కల్కి 2' పనులు వేగవంతం కావడంతో, ఆలియాకు డేట్స్ మరింత కష్టమయ్యాయి. దీంతో, అనివార్యంగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇన్!
ఆలియా భట్ స్థానంలోకి ఇప్పుడు సాయి పల్లవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 'గార్గి', 'ఫిదా', 'లవ్ స్టోరీ' వంటి చిత్రాలతో ఇప్పటికే తనకంటూ ఒక బలమైన పాన్-ఇండియా అభిమాన గణాన్నీ, లేడీ పవర్ స్టార్ ఇమేజ్‌నీ సంపాదించుకుంది. ఇప్పుడు సాయి పల్లవిని ఈ పాత్ర కోసం నాగ్ అశ్విన్ బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.
ALSO READ : కుమ్మేసిన 'కాంతార: చాప్టర్ 1' ఫస్ట్ డే కలెక్షన్స్..
ప్రస్తుతానికి సాయి పల్లవి, నితీష్ తివారీ రూపొందిస్తున్న 'రామాయణం' ప్రాజెక్టులో సీత పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. 'రామాయణం' రెండో భాగం షూటింగ్ 2026 మధ్య నాటికి పూర్తయితే, వెంటనే ఆమె నాగ్ అశ్విన్ సినిమా పనులను మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాతే నాగ్ అశ్విన్ మళ్లీ 'కల్కి 2'పై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు.
ఇలీవల నాగ్ అశ్విన్ కల్కి2 నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను మూవీ మేకర్స్ తప్పించారు. ఇప్పుడు మరో సినిమాలో ఆలియా భట్ స్వయంగా డేట్స్ క్లాస్ కావడం లేదంటూ తప్పకోవడంతో సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి పేరు తెరపైకి వచ్చింది. అయితే 'చాముండా' మూవీ కోసం సాయి పల్లవి పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.