సీనియర్ హీరోలను వెనక్కి నెడుతున్న అలియా భట్

సీనియర్ హీరోలను వెనక్కి నెడుతున్న అలియా భట్

బాలీవుడ్​ బ్యూటీ ఆలియా భట్​ సీనియర్​ హీరోలను సైతం వెనక్కినెడుతోంది. సంజయ్​ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా నటించిన ‘గంగూబాయి కతియావాడి’ బ్లాక్​ బస్టర్​ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలందుకుంది.

తాజాగా ఈ సినిమా 16 విభాగాల్లో 68వ ఫిలింఫేర్​ అవార్డులకు నామినేట్​ కావడం విశేషం. అదే సమయంలో భారీ వసూళ్లు సాధించిన అజయ్​ ‘దృశ్యం–2’ సినిమా మూడు విభాగాల్లో మాత్రమే నామినేట్​ అయ్యింది. ఏప్రిల్​ 27న ముంబయిలోని జియో వరల్డ్​ కన్వెన్షన్​ సెంటర్​లో ఈ  అవార్డుల వేడుకను నిర్వహించనున్నారు.