మే ఫస్ట్ లోపు అమెరికాలోని ప్రతి అడల్ట్‌కూ వ్యాక్సిన్!

మే ఫస్ట్ లోపు అమెరికాలోని ప్రతి అడల్ట్‌కూ వ్యాక్సిన్!

మే ఫస్ట్ లోపు అమెరికాలోని ప్రతి అడల్ట్‌కూ వ్యాక్సిన్ అందేలా చూస్తామన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్. వంద రోజుల్లో పదికోట్ల మందికి టీకా ఇప్పించాలని తాను అనుకున్నానన్నారు. అయితే.. 60 రోజుల్లోనే ఈ టార్గెట్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతవేగంగా వ్యాక్సినేషన్ జరగడంలేదన్నారు. రోజుకు 20లక్షల వ్యాక్సిన్లు ఇస్తేనే ఈ లక్ష్యం అందుకోగలం అన్నారు. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం కొత్త పోర్టల్ తెచ్చామన్నారు.  ఇప్పటివరకు అమెరికాలో 5లక్షల 27వేల 726మంది కరోనాతో చనిపోయారనీ.. ఇది తనను చాలా బాధపెడుతోందన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, వియత్నాం వార్, సెప్టెంబర్ 9 దాడుల్లో మృతుల సంఖ్య కన్నా ఇది చాలా ఎక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.