హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించాలి

హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించాలి

ములుగు, వెంకటాపూర్​(రామప్ప), వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు సదుపాయాలు, వసతి ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని పీవో చిత్రా మిశ్రా సూచించారు. వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

శుక్రవారం ములుగులోని ఎస్టీ, బాలురు, బాలికల సంక్షేమ హాస్టళ్లు, జగ్గన్నపేటలోని ఆశ్రమ పాఠశాల, వెంకటాపూర్ మండలం రామాంజపూర్ ఆశ్రమ పాఠశాలలను ఆమె సందర్శించి పరిశీలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలను డీడీ, స్పెషల్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో వెంట ములుగు ప్రత్యేకాధికారి దేవిశ్రీ, తదితరులున్నారు.