ఐఎన్‌‌ఐ-సెట్‌ నోటిఫికేషన్‌‌ విడుదల

ఐఎన్‌‌ఐ-సెట్‌ నోటిఫికేషన్‌‌ విడుదల

వైద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌‌ఐ-సెట్‌‌)-–2023 నోటిఫికేషన్‌‌ను న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. 

ఈఎంట్రన్స్​ ఎగ్జామ్​తోఎయిమ్స్‌‌(న్యూఢిల్లీ),జిప్‌‌మర్‌‌(పుదుచ్చేరి),నిమ్‌‌హాన్స్‌‌(బెంగళూరు),పీజీఐఎంఈఆర్‌‌(చండీగఢ్‌‌), ఎస్‌‌సీటీఐఎంఎస్‌‌టీ(త్రివేండ్రం)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌‌లలో పీజీ(ఎండీ, ఎంఎస్‌‌, ఎంసీహెచ్‌‌, డీఎం, ఎండీఎస్‌‌) సీట్లు భర్తీ చేయనున్నారు.ఎంబీబీఎస్‌‌, బీడీఎస్‌‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. 


సెలెక్షన్​ ప్రాసెస్​: ఎంట్రన్స్​ టెస్ట్​ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్‌‌ టైప్‌‌ ప్రశ్నలుంటాయి. మూడు గంటల సమయం ఇస్తారు. సరైన సమాధానానికి ఒక మార్కు, మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు చొప్పున నెగెటివ్​ మార్కింగ్​ ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థులకు రూ.1500, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించాలి. పరీక్ష నవంబర్​ 13వ తేదీని నిర్వహిస్తారు. వివరాలకు www.aiimsexams.ac.in వెబ్​సైట్​లో చూసుకోవాలి.